“ఆర్బిట్రేషన్ పై దృష్టి సారించి రైల్వేలలో వివాద పరిష్కారం ” అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం
హైదరాబాద్ 28 ఫిబ్రవరి (హి.స.)దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం “ఫోర్టిఫై లెక్చర్ సిరీస్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 27 , 2026 న సికింద్రాబాద్లోని రైల్ నిలయం సమన్వయ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్బిట్రేషన్పై దృష్టి సారించి రైల్వేలలో వివ
“ఆర్బిట్రేషన్ పై దృష్టి సారించి రైల్వేలలో వివాద పరిష్కారం ” అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం


హైదరాబాద్ 28 ఫిబ్రవరి (హి.స.)దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం “ఫోర్టిఫై లెక్చర్ సిరీస్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 27 , 2026 న సికింద్రాబాద్లోని రైల్ నిలయం సమన్వయ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్బిట్రేషన్పై దృష్టి సారించి రైల్వేలలో వివాద పరిష్కారం ( డిస్పూట్ రిజలుష్యన్ ఇన్ రైల్వేస్ విత్ ఫోకస్ ఆన్ ఆర్బిట్రేషన్) అనే అంశంపై ఒక ఉపన్యాసం నిర్వహించింది. ఇది విజిలెన్స్ బ్రాంచ్ “ఫోర్టిఫై లెక్చర్ సిరీస్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆరవ ఉపన్యాసం. ఇది సంస్థాగత జ్ఞానాన్ని బలోపేతం చేయడం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం మరియు రైల్వే అధికారులలో వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడంలో సంస్థ యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఈ అంశంపై గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుదేష్ణ సేన్, ఐ.ఆర్.ఏ.ఎస్ ఉపన్యాసం ఇచ్చారు. వారికి ఉన్న అపారమైన పరిపాలనా అనుభవం మరియు ఆర్థిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, రైల్వేలలో వివాద పరిష్కార విధానాలపై విలువైన సమాచారాన్ని అందించారు, ముఖ్యంగా వారి ఉపన్యాసంలో మధ్యవర్తిత్వం మరియు రైల్వే పనితీరులో దాని ఆచరణాత్మకంగా పాటించడంపై దృష్టి సారించారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే, అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ ఆశిష్ మెహ్రోత్రా, ప్రధాన కార్యాలయం నుండి ఇతర సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వీరితోపాటు , విజయవాడ, గుంతకల్ , సికింద్రాబాద్ , హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్ల నుండి డివిజనల్ రైల్వే మేనేజర్లు మరియు దక్షిణ మధ్య రైల్వేలోని 06 డివిజన్ల నుండి అధికారులు, అలాగే 03 వర్క్షాప్ల అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యకలాపాలలో పాల్గొని తద్వారా జోన్ వ్యాప్తంగా విస్తృత భాగస్వామ్యం మరియు సంస్థాగత విస్తరణను ధ్రువీకరించారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ సంధర్భంగా ఆర్బిట్రేషన్ అంశం పై మాట్లాడుతూ రైల్వే పరిపాలనలో ఆర్బిట్రేషన్ అంశం అత్యంత ముఖ్యమైనదని అన్నారు. రైల్వేలలో గణనీయమైన సంఖ్యలో కాంట్రాక్టు వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరిస్తారు. కాంట్రాక్టులు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెరుగుతున్న సంక్లిష్టతలతో, రైల్వే అధికారులు తాజా చట్టపరమైన నిబంధనలను విధిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఆర్బిట్రేషన్ మరియు రాజీ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రైల్వేకు వాటి ఆచరణలో ఎదురైయ్యే సమస్యలు మరియు సకాలంలో వివాద పరిష్కార విధానాలను నిర్ధారించడంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల ఔచిత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

శ్రీమతి సుదేష్ణ సేన్ ఉపన్యాసం సందర్భంగా, ఆర్బిట్రేషన్ యొక్క ముఖ్య అంశాలను సమగ్రంగా వివరించారు. ఆమె మధ్యవర్తుల నియామక విధానం గురించి , మధ్యవర్తిత్వం చర్యల నిర్వహణ మరియు దేశంలో ఆర్బిట్రేషన్ కి సంబంధించిన చట్టపరమైన ఎప్పటికప్పుడు సవరణ చెందుతున్న చట్టాలను వివరించారు. మధ్యవర్తిత్వం మరియు సయోధ్య చట్టం, 1996 కింద చట్టబద్ధమైన అంశాలను ఆమె వివరిస్తూ 2015, 2019 మరియు 2021లో ప్రవేశపెట్టబడిన ముఖ్యమైన సవరణలను వివరంగా చర్చించారు. వాటిలో ముఖ్యంగా చర్యలను వేగవంతం చేయడం మరియు సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న నిబంధనలపై దృష్టి సారించారు.

ప్రస్తుతం ఈ ప్రక్రియలో ఉన్న గణనీయమైన సమయం మరియు వనరులను పరిగణనలోకి తీసుకున్న సందర్భంలో ఆర్బిట్రేషన్ ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుందని శ్రీమతి సుధేష్ణ సేన్ తెలియజేశారు. మధ్యవర్తిత్వ కార్యకలాపాలను సమర్థవంతంగా ముగించడానికి నిర్దేశించిన సమయపాలన మరియు విధానపరమైన క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం చాలా అవసరమని ఆమె నొక్కి చెప్పారు. కార్యకలాపాలను పూర్తి చేయడానికి చట్టపరమైన నిర్ధారిత సమయపాలన మరియు విభాగ అధికారుల బాధ్యతలను కూడా ఈ సెషన్ ప్రస్తావించింది.

సమర్థవంతమైన మరియు చట్టబద్ధమైన వివాద పరిష్కారం పట్ల సంస్థ యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తూ సిబ్బంది మరియు అధికారులు ఈ ఉపన్యాసం చివరలో జరిగిన ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేలలో మధ్యవర్తిత్వ కేసులను పరిష్కరించడానికి ఉత్తమ పద్ధతులపై విలువైన అవగాహనను పొందడంతో ఈ ఉపన్యాసం ముగిసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande