మహానంది ఆలయానికి బొప్పన జాన్సీ లక్ష్మీ బాయి 30 లక్షల విరాళం
మహానంది, 01 మార్చి (హి.స.) , ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలోని ప్రధాన ఆలయానికి విజయవాడకు చెందిన దాత వైభవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ.80 లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ముందస్తుగా
మహానంది ఆలయానికి బొప్పన జాన్సీ లక్ష్మీ బాయి 30 లక్షల విరాళం


మహానంది, 01 మార్చి (హి.స.)

, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలోని ప్రధాన ఆలయానికి విజయవాడకు చెందిన దాత వైభవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ.80 లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ముందస్తుగా శనివారం రూ.30 లక్షలను దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల మధుకు అందజేశారు. మహానందికి దైవ దర్శనార్థం వచ్చారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు, నామార్చనలు చేసుకున్నారు. విరాళంతో ఆలయంలో ఇత్తడి గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయించడానికి నిపుణులను రప్పించి పనులను ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande