హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు
Tg


హైదరాబాద్, 01 మార్చి (హి.స.)అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. నానక్రామ్గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 50 మంది పోలీసులతో కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande