
తిరుపతి 01 మార్చి (హి.స.), తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగానే కాకుండా, ఇప్పుడు న్యాయవ్యవస్థ పరంగా కూడా ఒక భారీ ముందడుగు వేస్తోంది. తిరుపతి రూరల్ పరిధిలోని దామినీడులో నిర్మించనున్న నూతన కోర్టు భవనాల సముదాయంఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని న్యాయవాదులు చెబుతున్నారు. తిరుపతి రూరల్లోని దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది. ఈ భూమిని కేటాయించడం ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో న్యాయసేవలు మరింతగా సులభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16 కోర్టు భవనాల సముదాయాన్ని నిర్మించడానికి రూ.120 కోట్లు కేటాయించింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ సూర్యకాంత్ పాల్గొననున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని ఆయన ఇవాళ(ఆదివారం) దర్శించుకోనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఈ భూమి పూజకు హాజరవుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ