కానేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ రాయదుర్గం ప్రధాన రోడ్డు కబ్జాకు గురి
కణేకల్లు,, 01 మార్చి (హి.స.) : కణేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ వద్ద కణేకల్లు-రాయదుర్గం ప్రధాన రోడ్డుకు సంబంధించిన స్థలం కబ్జాకు గురైంది. స్థానిక వైకాపా నాయకుడి బంధువు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చారు. అందులో టీ
కానేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ రాయదుర్గం ప్రధాన రోడ్డు కబ్జాకు గురి


కణేకల్లు,, 01 మార్చి (హి.స.)

: కణేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ వద్ద కణేకల్లు-రాయదుర్గం ప్రధాన రోడ్డుకు సంబంధించిన స్థలం కబ్జాకు గురైంది. స్థానిక వైకాపా నాయకుడి బంధువు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చారు. అందులో టీ కేఫ్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలోనూ ఇదే స్థలం పక్కన షెడ్డు ఏర్పాటు చేసి, చిప్స్ దుకాణానికి అద్దెకివ్వడం గమనార్హం. ఈ స్థలానికి ఆనుకొని వంక పారుతుంది. దాని పక్కనే వైకాపా నాయకుడి బంధువులకు సంబంధించిన పొలం ఉంది. ఈ నెపంతో ఏకంగా కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. వర్షపు నీరు పారే వంకను కొంత మేర పూడ్చటంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి ఎగువన పొలాలు ముంపునకు గురవుతున్నాయని బాధిత రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయమై ర.భ డీఈ రవిశంకరరెడ్డిని వివరణ కోరగా స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలిసింది. రెవెన్యూ అధికారుల ద్వార నివేదిక తెప్పించుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర.భ స్థలం ఆక్రమణకు గురైనట్లు ఆశాఖ అధికారులకు తెలిపామని తహసీల్దారు బ్రహ్మయ్య, డీటీ విశ్వనాథ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande