తిరుపతిలోని పరిపాలన భవనంలో కమాండ్ కంట్రోల్ సెంటర్
తిరుపతి;, 01 మార్చి (హి.స.)తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు, డ్రై ఐలాండ్ నిర్మా
తిరుపతిలోని పరిపాలన భవనంలో కమాండ్ కంట్రోల్ సెంటర్


తిరుపతి;, 01 మార్చి (హి.స.)తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు, డ్రై ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేశారు. తితిదే ఆలయాల్లో పరిచారకులుగా పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆలయాలు, సత్రాలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని పరిపాలన భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది(మొత్తం 727 మంది) మాజీ సైనికోద్యోగులను భద్రతా సిబ్బందిగా నియమించుకునేందుకు ఆమోదం లభించింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో నూతన ఎక్స్-రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు.. తిరుమల, తిరుపతి గోశాలలు, పలమనేరులోని ఇంక్యుబేషన్ సెంటర్లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఛైర్మన్ వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande