వేటపాలెం లో బాణాసంచా ప్రమాదంలో.గాయపడిన క్షత గాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాకినాడ, 01 మార్చి (హి.స.) , వేట్లపాలెంలో బాణసంచా ప్రమాదంలో గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. శనివారం రాత్రి 11.45 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న డిప్యూటీ సీఎం క్షతగాత్రులకు అందు
వేటపాలెం లో బాణాసంచా ప్రమాదంలో.గాయపడిన క్షత గాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


కాకినాడ, 01 మార్చి (హి.స.)

, వేట్లపాలెంలో బాణసంచా ప్రమాదంలో గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. శనివారం రాత్రి 11.45 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న డిప్యూటీ సీఎం క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హోం మంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీ్షబాబు, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ తదితరులు ఉన్నారు. ప్రమాద సంఘటన వివరాలను పవన్కు కలెక్టర్, ఎస్పీ వివరించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande