పవిత్రమైన తిరుమలలో కొందరు యువత సెలెబ్రెటీలు రీల్స్
తిరుమల 01 మార్చి (హి.స.) , : పవిత్రమైన తిరుమలలో కొందరు యువత, సెలబ్రెటీలు తితిదే నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై తితిదే అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహిత
పవిత్రమైన తిరుమలలో కొందరు యువత సెలెబ్రెటీలు రీల్స్


తిరుమల 01 మార్చి (హి.స.)

, : పవిత్రమైన తిరుమలలో కొందరు యువత, సెలబ్రెటీలు తితిదే నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై తితిదే అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి ఘాట్రోడ్డు, శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై తితిదే ఛైర్మన్ స్పందించారు. స్వప్రయోజనాల కోసం రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande