
ముంబయి, 11, మార్చి (హి.స.) మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ ( ప్రయోగించిందని చెప్పారు.
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ