ధరల మంట.. మెనూలో కోత
లఖ్నవూ15,మార్చి (హి.స.) : పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లను తాకింది. దేశంలో ఇప్పటికే ఏర్పడ్డ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ఎక్కువ శాతం హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూలో పదార్థాలను తగ్గించి, ధరలను అమాంతం పెంచేశాయి. కొందరు
ధరల మంట.. మెనూలో కోత


లఖ్నవూ15,మార్చి (హి.స.) : పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లను తాకింది. దేశంలో ఇప్పటికే ఏర్పడ్డ ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ఎక్కువ శాతం హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూలో పదార్థాలను తగ్గించి, ధరలను అమాంతం పెంచేశాయి. కొందరు నిర్వాహకులు గ్యాస్ బదులు కట్టెలు, బొగ్గుల పొయ్యిని వాడుతుండటంతో వాటి ధరలు సైతం అధికమయ్యాయి. దిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్లలో కార్పొరేట్

మీటింగ్లు, గ్రూప్ సమావేశాల ప్రాధాన్యత తగ్గింది. వంట, వాణిజ్య గ్యాస్ కొరత భయాలను తగ్గించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ఉత్తర్ప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ దాదాపు 14 వందలకు పైగా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఆరుగురిని అరెస్టుచేసింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా, దక్షిణ 24 పరగణాల, ఉత్తర 24 పరగణాల సహా పలు జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ పంపిణీ కేంద్రాల వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా క్యూ కట్టారు. పలు చోట్ల ప్రజలకు పిడకలను ఉచితంగా పంపిణీ చేశారు. వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్న 316 వంట గ్యాస్ సిలిండర్లను కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎలక్ట్రికల్ స్టౌవ్లకు మారే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ దుకాణాలకు విద్యుత్ యూనిట్కు రూ.2 చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande