
ముంబయి, 11, మార్చి (హి.స.) పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్ గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
ఇండియా నుంచి అమెరికా.. యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా.. యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే.. టూ వే టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి సంస్థలు. ఎయిర్ ఇండియా.. ఎతిహాద్.. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే తొంభై వేల ధర ఉంటే ప్రస్తుతం లక్షన్నర ఉంది. టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ