ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ, 11,మార్చి (హి.స.) కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వ
ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్


ఢిల్లీ, 11,మార్చి (హి.స.) కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసి, కోర్టులో కనీస న్యాయ పరిభాషను చదవలేకపోయిన ఒక వస్త్ర వ్యాపారికి సుప్రీంకోర్టులో పరాభవం ఎదురైంది. ‘వెళ్లి లూధియానాలో మరో రెండు మూడు స్వెటర్లు అమ్ముకో.. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆ పిటిషన్ను కొట్టివేశారు.

పంజాబ్లోని లూధియానాకు చెందిన హోజరీ వ్యాపారి రజనీష్ సిద్ధూ 'పీఎం కేర్స్' (PM CARES) నిధికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సిద్ధూ స్వయంగా వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంగ్లీష్లో ఉన్న పిటిషన్ను చూసి చదువుతుండటం గమనించిన ధర్మాసనం ఆయన నేపథ్యంపై ఆరా తీసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన బెంచ్, సిద్ధూ చదువు గురించి ప్రశ్నించింది.

గతంలో ఎప్పుడూ పిటిషన్ వేయలేదని, నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చానని ఆయన చెప్పడంతో సీజేఐ వ్యంగ్యంగా స్పందించారు. ‘చాలా ధైర్యవంతుడివి.. నేరుగా లూధియానా నుండి సుప్రీంకోర్టుకు వచ్చావా? నీకు ఇక్కడే ఇంగ్లీష్ పరీక్ష పెడతాను. అందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా నువ్వే ఈ పిటిషన్ రాశావని నమ్ముతాను’ అని వ్యాఖ్యానించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande