చరిత్రలో ఇదే తొలిసారి’: లోక్సభలో రాహుల్ ఆగ్రహం
ఢిల్లీ, 11,మార్చి (హి.స.) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష
Rahul ,Priyanka


ఢిల్లీ, 11,మార్చి (హి.స.) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరిలోనే సుమారు 118 మంది ఎంపీలు సంతకాలు చేయగా, దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు సాధారణ మెజారిటీ అవసరం. అయితే, స్పీకర్ ఎన్నడూ పక్షపాతంగా వ్యవహరించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విపక్షంలోని 50 మందికి పైగా ఎంపీలు వ్యక్తిగతంగా తనను కలిసి, ఈ తీర్మానంతో తాము ఏకీభవించడం లేదని, కేవలం ఒత్తిడి మేరకే సంతకాలు చేశామని చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande