మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు.. కొనసాగుతోన్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ముంబై, 12 మార్చి (హి.స.) మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ముంబైలోని అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడంతో ఇవాళ ఉదయం తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. సుమారు 6.27కు అధికారులకు ఓ అజ్ఞాత ఈమెయిల్ వచ్చింది. అందులో అసెంబ్లీత
/bomb-threats-to-maharashtra-assembly-bomb-squad-checks


ముంబై, 12 మార్చి (హి.స.)

మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ముంబైలోని అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడంతో ఇవాళ ఉదయం తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. సుమారు 6.27కు అధికారులకు ఓ అజ్ఞాత ఈమెయిల్ వచ్చింది. అందులో అసెంబ్లీతో పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), బాంబే హైకోర్టులను పేల్చివేస్తామని నిందితులు హెచ్చరించారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), యాంటీ టెర్రర్ యూనిట్లు, డాగ్ స్క్వాడ్తో కలిసి రంగంలోకి దిగారు. విధాన భవన్ పరిసరాలను ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సమయంలో మీడియా, సామాన్య ప్రజలను లోపలికి అనుమతించ లేదు. చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ను మళ్లించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చాలాసేపు తనిఖీల అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు ధృవీకరించారు. మహారాష్ట్ర హోం మంత్రి పంకజ్ భోయిర్ మాట్లాడుతూ.. ఈ బెదిరింపు కేవలం వదంతేనని స్పష్టం చేశారు. భద్రతా తనిఖీల అనంతరం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అసలు ఆ ఈ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande