సంక్షోభ స్థాయికి వంటగ్యాసు కొరత
ఢిల్లీ, 12,మార్చి (హి.స.) : పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంటగ్యాసు (ఎల్పీజీ) ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను నల్లబజారులో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబయి, దిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు
LPG


ఢిల్లీ, 12,మార్చి (హి.స.) : పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంటగ్యాసు (ఎల్పీజీ) ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను నల్లబజారులో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబయి, దిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ‘తాత్కాలికంగా’ మూతబడటం ప్రారంభమైంది. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నాయి. ఆలయాలు, మఠాలపై సైతం వంటగ్యాసు కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో ‘రామ్ రసోయీ’ అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవేవ్ అవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని ఐఆర్సీటీసీ పశ్చిమ జోన్లోని కేటరింగ్ యూనిట్లను ఆదేశించింది.

వాణిజ్య సిలిండర్లపై సమీక్షకు కమిటీ

నల్లబజారులో గ్యాస్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. బుక్ చేసిన రెండున్నర రోజుల వ్యవధిలో గృహ వినియోగదారులకు సిలిండర్ అందజేసే విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది. వంటగ్యాసు సమస్యపై కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. గృహ వినియోగదారులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande