2025-26లో భారత వృద్ధి 7.5%
ఢిల్లీ, 14మార్చి (హి.స.) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 6.7 శాతానికి పెంచింది. 2026లో అంతర్జాతీయంగా ముడిచమురు సగటు ధర బ్యారెల్
2025-26లో భారత వృద్ధి 7.5%


ఢిల్లీ, 14మార్చి (హి.స.) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ వృద్ధి అంచనాలను 6.7 శాతానికి పెంచింది. 2026లో అంతర్జాతీయంగా ముడిచమురు సగటు ధర బ్యారెల్కు 70 డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%, 2026-27లో 6.4% వృద్ధిరేటును గత డిసెంబరులో ఫిచ్ అంచనా వేసింది. 2026-27 ప్రథమార్థంలో వృద్ధి నెమ్మదించొచ్చని గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్- 2026లో అభిప్రాయపడింది. సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు 8.4% కాగా, డిసెంబరు త్రైమాసికంలోలో 7.8 శాతానికి తగ్గింది.

ఈ ఏడాది భారత వృద్ధికి దేశీయ డిమాండ్ దోహదపడుతుందని, వినియోగదారు వ్యయాలు, పెట్టుబడులు వరుసగా 8.6%, 6.9% పెరిగే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది.

ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యాక చమురు ధర బ్యారెల్కు 30 డాలర్లు పెరిగి 100 డాలర్లకు చేరింది. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా, ఈనెలలో చమురు ధర 90-100 డాలర్ల మధ్య ఉండొచ్చని, ద్వితీయార్థం నాటికి 60 డాలర్ల మధ్యకు పడిపోవచ్చని ఫిచ్ భావిస్తోంది. దీని వల్ల 2026 వార్షిక సగటు ధర 70 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.

2026లో ప్రపంచ జీడీపీ వృద్ధి 2.6 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. చమురు బ్యారెల్ ధర 100 డాలర్ల వద్ద స్థిరంగా ఉంటే, ప్రపంచ సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఫిచ్ ముఖ్య ఆర్థికవేత్త బ్రియాన్ కౌల్టన్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande