
సూళ్లూరుపేట 15 మార్చి (హి.స.)సూళ్లూరుపేట పట్టణంలోని బంగారు దుకాణంలో 110గ్రాముల బంగారం చోరీ జరిగింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దుకాణదారుడి కళ్లలో కారంపొడి చల్లి బంగారాన్ని అపహరించుకు పోయాడు. ఈ ఘటన దుకాణంలోని సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ