
అమరావతి, 14 మార్చి (హి.స.)
కర్నూలు టౌన్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని గార్గేయపురం చెరువులో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించారు. దంపతుల మధ్య కలహాలే ఈ ఘటనకు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ