కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని ఆస్పరి.బైపాస్ రహదారి.సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి
అమరావతి, 12 మార్చి (హి.స.) ఆదోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆస్పరి బైపాస్ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న ఆచారి(35
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని ఆస్పరి.బైపాస్ రహదారి.సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి


అమరావతి, 12 మార్చి (హి.స.)

ఆదోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆస్పరి బైపాస్ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న ఆచారి(35) అనే యువకుడు, తన బంధువైన నరేశ్ ఆచారితో కలిసి ద్విచక్రవాహనంపై ఆదోని నుంచి ఆస్పరి వైపునకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆస్పరి బైపాస్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఈరన్న ఆచారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. గాయపడిన నరేశ్ ఆచారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande