
అమరావతి, 11 మార్చి (హి.స.)
గుడివాడలో భారీ బెట్టింగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. గుడివాడ రూరల్ మండలం టిడ్కో కాలనీ ఫ్లాట్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో మసాలా శివ, భాను ప్రసాద్, కనక మహేష్, అజయ్ బాబు, వంశీ కిరణ్ ఉన్నారు. బెట్టింగ్ రాయుళ్ల వద్ద నుంచి రూ.1.05 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మసాలా బండి నుంచి... బెట్టింగ్ ద్వారా శివ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో శివకు పోలీసులు రాచ మర్యాదలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శివ ఫోన్లలో పలువురు పోలీస్ అధికారులు, వైసీపీ నేతల వ్యక్తిగత నంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కొడాలి నానికి పెద్ద ఎత్తున నగదును శివ సమకూర్చినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలోనూ శివ బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టితో బెట్టింగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో మసాలా శివతో జట్టుకట్టి బెట్టింగ్ దందాలు నడిపినట్లు కొడాలి నాని రాజకీయ వ్యూహకర్త వినోద్పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వినోద్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ