
ఢిల్లీ, 15,మార్చి (హి.స.)
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి తక్కువ దశల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని కమిషన్ పరిశీలిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తేదీలు ప్రకటించిన వెంటనే, ఈ రాష్ట్రాలన్నింటిలో ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈసీ తేదీలను ప్రకటిస్తుందని తెలుస్తోంది.
2021 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల ఓటింగ్ జరిగింది, కానీ ఈసారి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు. దీని కోసం కేంద్ర బలగాల మోహరింపు గణనీయంగా పెంచనున్నట్లు సమచారం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో, ఎన్నికలు నిష్పాక్షికంగా, హింస లేకుండా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో తుది ఓటర్ల జాబితాపై అప్పీళ్లకు గడువు ముగిసింది. ఎన్నికల కమిషన్ సన్నాహకాలను సమీక్షించి, అధికారిక ప్రకటన కోసం వేచి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ