
ఢిల్లీ/ , 15,మార్చి (హి.స.) అమెరికా జియో పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ విత్ ఇండియన్ కాంస్టలేషన్(నావిక్) వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నావిక్ వ్యవస్థలో భాగమైన నాలుగు ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎ్సఎ్స) ఉపగ్రహాల్లో ఒకటైన ఐఆర్ఎన్ఎ్సఎ్స 1ఎఫ్లోని అణు గడియారాలు చెడిపోయాయి. దీంతో దాని ద్వారా అందే పొజిషనింగ్, నావిగేషన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది. దీని జీవిత కాలం పదేళ్లు కాగా.. ఈ నెల 10వ తేదీతో అది పూర్తయ్యింది. ఈ ఉపగ్రహంలోని మూడు అణు గడియారాల్లో రెండు చెడిపోవటంతో శుక్రవారం నుంచి నావిక్ సేవల్లో అంతరాయం తలెత్తిందని ఇస్రో వర్గాలు శనివారం ప్రకటించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ