
ఢిల్లీ, 18,మార్చి (హి.స.) కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మంగళవారం (మార్చి 17) నాడు 55 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో ఈ పేర్లకు ఆమోదం ముద్ర వేశారు.
జాబితాలో కీలక అభ్యర్థులు వీరే..
కాంగ్రెస్ తన తొలి జాబితాలో అనుభవానికి, యువతకు పెద్దపీట వేసింది. తొలి జాబితాలో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం కల్పించారు కాంగ్రెస్ పెద్దలు. హరిపాడ్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు రమేష్ చెన్నితాల, పెరవూర్ నుంచి ప్రతిపక్ష నాయకుడు వి.డి.సతీసన్ బరిలోకి దిగనున్నారు. అలాగే కేరళ పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ కూడా పెరవూర్ నుంచే పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఊమెన్ చాందీ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే చాందీ ఊమెన్ పుతుప్పల్లి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇతర ప్రముఖులలో వట్టియూర్కావు నుంచి కె.మురళీధరన్, చిరాయింకీజు నుంచి రమ్య హరిదాస్ బరిలోకి దిగనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ