విమాన ప్రయాణికులకు భారీ ఊరట..
ఢిల్లీ, 18,మార్చి (హి.స.) విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్ల (Flight Ti
AIR INDIA


ఢిల్లీ, 18,మార్చి (హి.స.) విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్ల (Flight Tickets)పై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా విమానయాన సంస్థలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.

విమానాల్లో సీట్ల (Seats in Flights) ఎంపికకు ఛార్జీల వంటి కన్పించని రుసుములతో ఎయిర్లైన్లు దోపిడీకి పాల్పడుతున్నాయంటూ కొంతకాలంగా ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానాల్లో సీట్ల ధరలు అవి ఉన్న స్థానాలకు అనుగుణంగా వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు విండో సీటు, దారి పక్కన ఉండే సీట్లు కాస్త ఎక్కువ సౌకర్యవంతంగా ఉండటంతో ఆయా సీట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీంతో వీటికి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. విమానంలో చాలా తక్కువ సీట్లకు మాత్రమే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అవి కూడా మధ్య వరుసలో ఉండేవి లేదా.. చివర్లో ఉండేవే. ఈ తరహా అదనపు ఛార్జీలు ఎందుకంటూ ప్రయాణికులు తరచూ సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌరవిమానయాన శాఖ తాజా చర్యలు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande