అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!
ఢిల్లీ, 18,మార్చి (హి.స.) న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం సుమారు 7 గంటల స
అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!


ఢిల్లీ, 18,మార్చి (హి.స.) న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

మంటలు తీవ్రంగా వ్యాపించడంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. దాదాపు మూడు గంటల పాటు అగ్ని అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఘటన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. మంటల భయంతో ఇద్దరు వ్యక్తులు భవనంపై అంతస్తు నుంచి దూకగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande