
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)భట్టి బడ్జెట్.. బడా జూటా బడ్జెట్, బోగస్ బడ్జెట్’ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బడ్జెట్లో సకల జనులకు దక్కింది సున్నా మాత్రమేనని.. అంకెలు, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. తెలంగాణను, హైదరాబాద్ను మూడు ముక్కలు చేయడం తప్ప.. భట్టి ప్రవేశ పెట్టిన పద్దులో ఏమీ లేదని దుయ్యబట్టారు. తమ హయాంలో అప్పులు చేసి.. ఆస్తులు సృష్టించామని, కాంగ్రెస్ రూ.3.5లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
కర్షకులకు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు క్షమాపణ చెబుతారని భావిస్తే.. ఇష్టారీతిన అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పెట్టుబడుల విషయంలోనూ కట్టుకథలే చెప్పారని, అక్రమ సంపాదన దాచుకునేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధి 12.50శాతం ఉండగా.. కాంగ్రెస్ పాలనలో 10.07 శాతానికి తగ్గిందన్నారు. బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగాని తనం అర్థమైందని హరీశ్రావు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్