
అమరావతి, 21 మార్చి (హి.స.)
అమరావతి, :ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది. గత 21 నెలల కూటమి ప్రభుత్వ కృషితో ఈ భారీ ప్రాజెక్టు సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేయనుంది.
సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు కర్మాగారం వస్తే దానిపై ఆధారపడే వందలాది చిన్న తరహా పరిశ్రమలు చుట్టుపక్కల ఏర్పడతాయి. తద్వారా పరోక్ష ఉపాధి భారీగా పెరుగుతుంది. ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ సంస్థలు ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సంస్థలు అత్యంత
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ