మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు లో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. ఉప్పర్పల్లి కోర్టు ఈ పిటిషన్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డ
Farmhouse


హైదరాబాద్, 20 మార్చి (హి.స.)

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు

లో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ పూర్తయింది. ఉప్పర్పల్లి కోర్టు ఈ పిటిషన్పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారించేందుకు వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఫామ్ హౌస్లో జరిగిన వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.

ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో

ఉభయ పక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. నిందితుల తరపు లాయర్లు కస్టడీని వ్యతిరేకించగా, కేసు తీవ్రత దృష్ట్యా విచారణ అవసరమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును వచ్చే సోమవారానికి రిజర్వ్ చేసింది. ప్రస్తుతం నిందితులు రిమాండ్లో ఉండగా.. ప్రస్తుతం కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో తదుపరి విచారణకు అత్యంత కీలకం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande