
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. మసీదులు, చారిత్రక భవనాలు విద్యుత్ దీపాలతో దగదగ మెరిసిపోతున్నాయి. నగరానికి ప్రత్యేకమైన హాలిమ్ రుచులను ఆస్వాదిస్తూ రాత్రి వేళలో భారీ సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేస్తుండడంతో నగరంలోని పలు వీధులలో సందడి నెలకొంది. చార్మినార్, పాత బస్తి, ఫలక్నామ, పురాణాపూల్, సుల్తాన్ బజార్, బోరబండ, పటాన్చెరు ప్రాంతాల లోని బట్టల దుకాణాలు, బ్యాంగిల్ స్టోరులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ముస్లిం కుటంబాలు పండుగ రోజు తప్పనిసరిగా కొత్తబట్టలు, అలంకరణ వస్తువులు ధరిస్తారు. ఇందులో పేద, ధనిక తేడాలు లేకుండా ఐక్యత చాటుకుంటారు. సువాసన వెదజల్లే అత్తార్లు, టోపీలు, గాజులు, పేనిలు, సేమియాలు, ఖర్జూరాలు, బాదం, పిస్తా, కాజు లాంటి డ్రైఫ్రూట్స్ విక్రయదారులు కోనుగోలుదారులతో కళకళలాడుతున్నారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే అత్తరు మంచి సువాసనలు వెదజల్లుతాయి. అత్తరు సువాసనను బట్టి ధరలు ఉంటాయి.
పండుగ రోజు కొత్త బట్టలు ధరించి ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్దకు వెళ్ళే ముందు అత్తరు రాసుకొని వెళ్తారు. ప్రస్తుతం అత్తరు ధరలు రూ.50 నుంచి రూ.200కు పైచిలుకే రంజాన్ రోజు ముస్లింలు సుర్మాను పెట్టుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు