గిరిజనులకు, పేదలకు పెద్ద పీట.. భట్టి విక్రమార్క బడ్జెట్ హైలెట్స్.
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) తెలంగాణలోని మారుమూల ప్రాంతాలల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం 5. 12,600 కోట్లను కేటాయించింది. ఈ నిధులను ''ఇందర సౌర గిరి జల వికాసం'' పథకం ద్వారా ఖర్చు చేయనున్నారు. 100 శాతం సబ్సిడీతో సోలార్
Budget


హైదరాబాద్, 20 మార్చి (హి.స.)

తెలంగాణలోని మారుమూల ప్రాంతాలల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం 5. 12,600 కోట్లను కేటాయించింది. ఈ నిధులను 'ఇందర సౌర గిరి జల వికాసం' పథకం ద్వారా ఖర్చు చేయనున్నారు. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2.10 లక్షల గిరిజన రైతులకు లబ్ధిచేకూర్చనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాంరంభించామని, దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని భట్టి తెలిపారు.

కాగా బడ్జెట్ లో పేద, ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఈ బీమా పొందనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేసారు.

పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి భారీ ఊరటనిచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా కొత్తగా మరో 2 లక్షల మందికి 'చేయూత' పెన్షన్లు (Cheyutha pensions) మంజూరు చేయనన్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామర్క ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన సుమారు 2 లక్షల మందికి ఈ ఏడాది నుంచి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande