సరదాగా ఫోటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్ధులు.గల్లంతు
భద్రాచలం,, 21 మార్చి (హి.స.)సరదాగా ఫొటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారానికి వచ్చిన వీరు తమ కుటుంబాలను అంతులేని విషాదంలో ముం చేశారు. ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మం డలం వేలేరు
సరదాగా ఫోటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్ధులు.గల్లంతు


భద్రాచలం,, 21 మార్చి (హి.స.)సరదాగా ఫొటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారానికి వచ్చిన వీరు తమ కుటుంబాలను అంతులేని విషాదంలో ముం చేశారు. ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మం డలం వేలేరు ప్రాంతంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటే సమయానికి మూడు మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం నదిలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన ఏడుగురు విద్యార్థుల్లో ఇప్పుడు మిగిలిన ఇద్దరే ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచారు. ప్రమాదం నుంచి బయటపడిన చుండూరు దీపక్ అనే విద్యార్థి పోలీసులకు తెలిపిన వివరాలివి.. అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో దీపక్, గడ్డం హర్షవర్దన్, గోకా తేజజ్ఞసాయి, పాశం సతీశ్కుమార్, చారుగండ్ల శ్రీకర్గుప్తా చదువుతున్నారు. స్నేహితుడికి చెందిన కారులో దీపక్, హర్ష, తేజ్, సతీశ్ బయలుదేరగా, దారిమధ్యలో విజయవాడలో దగ్గుబాటి నవదీప్ (ఉయ్యూరు కేఎల్యూ), భద్రాచలంలో శ్రీకర్, పొడిచేటి అభిరామ్ (ఇంటర్మీడియెట్) జత కలిశారు. శ్రీకర్, అభిరామ్లది తెలంగాణ.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande