భద్రాద్రి శ్రీరామచంద్ర మూర్తి కళ్యాణానికి.చీరాల గోటి టాకంబ్
అమరావతి, 21 మార్చి (హి.స.) భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి కల్యాణానికి చీరాల నుంచి గోటి తలంబ్రాలను భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ నేడు 25 వేల కిలోల వరకు పంపుతూ ఆ
భద్రాద్రి శ్రీరామచంద్ర మూర్తి  కళ్యాణానికి.చీరాల  గోటి టాకంబ్


అమరావతి, 21 మార్చి (హి.స.)

భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి కల్యాణానికి చీరాల నుంచి గోటి తలంబ్రాలను భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ నేడు 25 వేల కిలోల వరకు పంపుతూ ఆ స్వామి సేవలో పునీతులవుతున్నారు.

భద్రాచలంలో శ్రీరామనవమి రోజున జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవంలో గోటి తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. వీటిని కల్యాణంలో వినియోగించిన తరువాత భక్తులకు పంపిణీ చేస్తారు. నేరుగా హాజరుకాలేని భక్తులకు తపాలా శాఖ ద్వారా పంపేలా ఆలయ అధికారులు ఏటా ఏర్పాట్లు చేస్తున్నారు.

చీరాలకు చెందిన శ్రీరఘురామ్ భక్త సేవా సమితి ఛైర్మన్ పొత్తూరి బాలకేశవుల సిద్ధాంతి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టారు. వీటి కోసం ఈయన కారంచేడు మండలం స్వర్ణలో తనకున్న రెండెకరాల్లో ధాన్యం పండిస్తున్నారు. నాట్లు వేసే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. ఏటా విజయదశమి రోజున నాట్లు వేయడం ప్రారంభించి హోలీ పౌర్ణమి నాటికి పంటను కోసే ప్రక్రియ పూర్తిచేస్తారు. ఇలా వచ్చిన ధాన్యంతో పాటు చుట్టుపక్కల రైతుల నుంచి మరికొంత సేకరించి కలుపుతారు. భద్రాది ఆలయం నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ తయారుచేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వడ్లకు పూజలు చేసి, పట్టణంలోని వాసవీనగర్లో మహిళా భక్తుల ఆధ్వర్యంలో చేతితో వలిచే ప్రక్రియ నిర్వహిస్తారు. ఇదే సమయంలో వడ్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించి వలిచే కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ ఇక్కడికి తీసుకొస్తారు.

పసుపు దంచి.. తలంబ్రాల్లో ముత్తైదువులతో దంచిన పసుపుతో పాటు కుంకుమ, గులామ్, నూనె, నెయ్యి, జాస్మిన్ సెంటు, రోజ్ వాటర్ తదితరాలను కలుపుతారు. ఇలా కలిపిన వాటిని సంచుల్లో పోసి స్వామివారి ఆలయానికి తీసుకెళ్లి అప్పగిస్తారు. ప్రస్తుతం తలంబ్రాలతో పాటు పసుపు 350 కిలోలు, కుంకుమ 400 కిలోలు, ఆయిల్ 350 కిలోలు, గులామ్ 750 కిలోలు ఆలయానికి అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande