రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత : ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
వేములవాడ : 21 మార్చి (హి.స.) దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandrasekhar Reddy) అన్నారు. శనివారం వేములవాడ ( Vemulawada) లోని భీమేశ్వర స
ఐ జి చంద్రశేఖర్ రెడ్డి


వేములవాడ : 21 మార్చి (హి.స.)

దేశ నలుమూలల నుంచి వచ్చే రాజన్న

భక్తులకు పటిష్టవంతమైన భద్రత కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandrasekhar Reddy) అన్నారు. శనివారం వేములవాడ ( Vemulawada) లోని భీమేశ్వర స్వామి ఆలయం సందర్శనం సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఈవో రమాదేవి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలయ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ, సిరిసిల్ల, డీఎస్పీలు శ్రీనివాసులు, నాగేంద్రచారి, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande