ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముస్లిం.సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు
అమరావతి, 21 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల మెుత్తం ఉపవాస దీక్షలు చేశారని.. దాని ఫలితం సమాజానికి చేరుతుందని అన్నారు. ''నెలవంక కనిపించింది. నెలంతా కఠోర దీక్ష చేసిన ప్ర
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముస్లిం.సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు


అమరావతి, 21 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల మెుత్తం ఉపవాస దీక్షలు చేశారని.. దాని ఫలితం సమాజానికి చేరుతుందని అన్నారు. 'నెలవంక కనిపించింది. నెలంతా కఠోర దీక్ష చేసిన ప్రతి మోము మురిసింది. ఉపవాస దీక్షతో పొందిన శాంతి, కరుణ, దానం ప్రతి మది నుంచి సమాజానికి చేరింది. శాంతి, సుహృద్భావం వెల్లివిరిసింది. రంజాన్ పండుగ మీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని, ఆ అల్లాహ్ మిమ్మల్ని చల్లగా చూడాలని, ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను' అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 'పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

'ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారు. శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుక చేసుకుంటున్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు' అంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande