
నల్లగొండ, 21 మార్చి (హి.స.)
రంజాన్ (ఈద్-ఉల్- ఫితర్) ను
శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. నిన్న జరిగిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ.3,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని, దీంతో ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు.
ఈ వేడుకలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ రమేశ్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, మాజీ మున్సిపాల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్లెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఈద్గా కమిటి నిర్వాహకుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, తాసీల్దార్ పరశురాం, వివిధ డివిజన్స్ కార్పోరేటర్లు శ్రీదర్, అల్లి మల్లేశ్, అల్లి సుభాష్, మారగోని నవీన్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు పుచ్చకాలయ నర్సిరెడ్డి, దండేపల్లి సత్తయ్య, ముస్లిం మత గురువు మౌలానా ఏహాసానుద్దీన్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..