తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం చంద్రబాబు
తిరుమల, 21 మార్చి (హి.స.) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీకి సంబంధించిన కీలక విభాగాలను సందర్శించి, అత్యాధునిక ల్యాబ్ను ప్రారంభించారు. కొండపై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక
cm-chandrababu-naidu-visited-command-cont


తిరుమల, 21 మార్చి (హి.స.)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీకి సంబంధించిన కీలక విభాగాలను సందర్శించి, అత్యాధునిక ల్యాబ్ను ప్రారంభించారు. కొండపై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం సందర్శించారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ, పర్యవేక్షణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ నిఘా ద్వారా భక్తులకు అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల పిండిమర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన 'వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లాబొరేటరీ'ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండంతస్తుల భవనంలో ఈ ల్యాబ్ రూపుదిద్దుకుంది. శ్రీవారి ప్రసాదాల తయారీకి వాడే ముడి సరకులు, నెయ్యి, నీరు, భక్తులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను ఈ ప్రయోగశాలలో శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిటీ చెకింగ్(FSSAI) ఇక్కడ అందుబాటులోకి రానుంది. ఒక ఆలయంలో క్వాలిటీ చెకింగ్ కోసం FSSAIను పెట్టడం ఇద తొలిసారి కావడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande