తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సేవలో సీఎం కుటుంబం
తిరుమల, 21 మార్చి (హి.స.) ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు మూడ్రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8
తిరుమల


తిరుమల, 21 మార్చి (హి.స.)

ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు మూడ్రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి టోకెన్లు లేకుండా వెళ్లే భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4-6 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనం కోసం క్యూలో ఉన్నవారికి 3-4 గంటల సమయం పడుతుంది. నిన్న (శుక్రవారం) స్వామివారిని 69,008 మంది భక్తులు దర్శించుకోగా.. 34,001 మంది భక్తులు తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.

నారా లోకేష్ - బ్రాహ్మణిల ఏకైక కుమారుడైనా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా.. సీఎం చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. వేకువజామున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం దంపతులు, లోకేష్, దేవాన్ష్ లకు వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు చంద్రబాబు, దేవాన్ష్ లు అల్పాహారాన్ని వడ్డించారు. కాగా.. తిరుమలలోనే ప్రసాదాల కల్తీని గుర్తించే అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా సీఎం సందర్శించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande