టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
అనంతపురం, 21 మార్చి (హి.స.)ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలరోజులుగా చికిత్స పొందుతూ..
హనుమంతరాయ చౌదరి


అనంతపురం, 21 మార్చి (హి.స.)ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలరోజులుగా చికిత్స పొందుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

హనుమంతరాయ చౌదరి రాజకీయ ప్రస్థానం అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభమైంది. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచిగా గెలిచిన ఆయన అనంతరం మండల పార్టీ అధ్యక్షుడిగా, సింగిల్ విండో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి, తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. 2000 నుంచి 2010 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998-2004 మధ్య కాలంలో ‘మార్ఫెడ్’ (MARKFED) చైర్మన్గా, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా రైతు సంక్షేమం కోసం పనిచేశారు. హనుమంతరాయ చౌదరి గారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande