
ఢిల్లీ, 25మార్చి (హి.స.) భారత ప్రభుత్వం పన్ను విధానంలో భారీ మార్పులు తేనుందా? అంటే అవుననే సమాచారం అందుతుంది.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫైనాన్స్ బిల్లులో మొత్తం 53 సవరణలు తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ఆ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని సమాచారం. వీటిలో 32 సవరణలు ప్రధానంగా పన్ను విధానాన్ని సులభతరం చేయడానికి, మిగతా 21 సవరణలు పరిపాలనా పరమైనవి అని అధికారులు చెబుతున్నారు..
ప్రధాన సవరణలు ఏమిటి?
ఈ సవరణల ప్రకారం, పన్ను శాఖకు కోర్టులు మరియు అప్పీల్ ట్రిబ్యునల్స్ ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా లెక్కింపు కేసులను మళ్లీ ప్రారంభించే అధికారం విస్తరించబడుతుంది. ఇప్పటికే ఉన్న సమయ పరిమితులను మించి కూడా అప్పీల్ అధికారుల తీర్మానాల ఆధారంగా పున:లెక్కింపులు చేయవచ్చు. దీని ద్వారా పాత పన్ను కేసులు కూడా న్యాయస్థానాల ఉత్తర్వుల ఆధారంగా తిరిగి పరిశీలించబడే అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు.. పున:లెక్కింపుల సమయంలో ఎదురయ్యే లోపాలను సరిచేసి, స్పష్టమైన నిబంధనలను ప్రవేశపెట్టడం జరుగుతోంది. పన్ను నోటీసులు నిర్దిష్ట సమయ పరిమితితో వస్తాయి.. కనీసం 30 రోజులు, గరిష్టంగా 3 నెలల సమయం కేటాయించబడుతుంది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ