
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ పునర్విభజనను చేపట్టింది. రేర్, క్యూర్, కేర్ విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించి రంగారెడ్డి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అలాగే.. గతంలో ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లను నాలుగు కమిషనరేట్లుగా మార్చడంతో కొత్తగా ఫోర్త్ సిటీ పేరుతో కమిషనరేట్ ఏర్పాటైంది. పోలీ స్ కమిషనరేట్ల హద్దులు.. జిల్లాల సరిహద్దులు ఒ కే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో రంగారెడ్డి జిల్లాను అర్బన్, రూరల్ జిల్లా లుగా విభజించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జ రుగుతోంది. కందుకూరు, మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల, ఆమన్జల్, శంషాబాద్ రూరల్ మండలం, మాడ్గుల, తలకొండపల్లి, యాచారం, మంచాల తదితర మండలాలతో ఫ్యూచర్ సిటీ క మిషనరేట్ను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సమానంగా ఇతర ప్రాంతాలను కలుపుకుని కొత్త జిల్లాను ఏ ర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు
సం బంధించి రెవెన్యూ శాఖ వివరాలను సేకరించి ప్ర భుత్వానికి సైతం నివేదించినట్లు సమాచారం. రా జకీయ ముఖచిత్రం మారిపోయి 'పునర్విభజన' రాజకీయాల్లో ఓ గేమ్ ఛేంజర్గా నిలవనున్నదన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఏడు శాసన సభ నియోజకవర్గాలు పూర్తిగా జిల్లా పరిధిలో ఉండగా.. కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం సింహభాగం మం డలాలు ఆమనల్, తలకొండపల్లి, మాడ్గుల, క డ్తాల్లు రంగారెడ్డి జిల్లాకు చెందినవే ఉన్నాయి. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలంతో కలిపి రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాలతో ఆమనల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడనున్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గా ల నుంచి వ్యక్తమవుతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి హయత్ నగర్ కేంద్రంగా కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడుతుందన్న వాదన విన్పిస్తోం ది. మహేశ్వరం నియోజకవర్గ విషయానికొస్తే ఖచ్చితంగా రెండు కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకటి, బడంగ్పేట్ లేదా బాలాపూర్ కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశా లు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. శేరిలింగంపల్లి పునర్విభజన సందర్భంగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడవచ్చన్నది తెలుస్తోంది. మియాపూర్, గచ్చి బౌలి, కొండాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతా లు నియోజకవర్గ కేంద్రాలుగా కొత్తవి ఆవిర్భవించవచ్చు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సైతం కొత్తగా ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడనున్నట్లు తెలు స్తోంది. శాస్త్రిపురం, అత్తాపూర్, శంషాబాద్లలో ఒకటి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా 8 లేదా 9 కొత్త అసెంబ్లీ స్థానాలు రంగారెడ్డి జిల్లాలో ఏర్పా టు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..