
జమ్మూ: , 27 మార్చి (హి.స.) జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.
జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు.
ఇరాన్కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.
‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ