డీఎంకే-కాంగ్రెస్ సీట్లు సర్దుబాటు..
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)తమిళనాడులో అధికార డీఎంకే (DMK), కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి..మిగతా 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుద
Thirumavalavan with Stalin


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)తమిళనాడులో అధికార డీఎంకే (DMK), కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి..మిగతా 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌ (Congress)కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి, కారైకుడి మొదలైన స్థానాలు ఉన్నాయి. డీఎండీకేకు 10 సీట్లు, రెండు వామపక్ష పార్టీలకు చెరో 5 స్థానాలు, వీసీకేకు 8, ఎండీఎంకే 4, ఎంఎంకే 2, ఐయూఎంఎల్‌ 2, ఎంజేకే ఎస్‌డీపీఐకు చెరొక సీటు కేటాయించింది.

ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎంకే అభ్యర్థుల తొలి జాబితాను స్టాలిన్‌ (CM Stalin) విడుదల చేశారు. కొలతూర్‌ నుంచి స్టాలిన్‌, చెపాక్‌-ట్రిప్లికేన్‌ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పోటీ చేయనున్నారు. కొయంబత్తూర్‌ సౌత్‌ నుంచి మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ బరిలోకి దిగారు. బోడినాయగనూర్‌ నుంచి పన్నీర్‌సెల్వం పోటీలో ఉన్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరగనుంది. కౌంటింగ్‌ మే 4న ఉంటుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande