60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
త్వరలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం


ఢిల్లీ. 27 మార్చి (హి.స.)దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నా

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande