కే.రళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.
తిరువనంతపురం, 28 మార్చి (హి.స.)కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్
Modi sonia birthday wishes


తిరువనంతపురం, 28 మార్చి (హి.స.)కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలు

కేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.

4

జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా సాధ్వీ నిరంజన్జ్యోతి

దిల్లీ: జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఈమె 2014 నుంచి 2024 వరకు ఫతేపుర్ పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, వినియోగదారులు, ప్రజాపంపిణీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయమంత్రిగా సేవలందించారు. అంతకుముందు 2012లో యూపీలోని హమీర్పుర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈమెతో పాటు కమిషన్ సభ్యుడిగా మహారాష్ట్రకు చెందిన కిరణ్ ఉమేష్ మహాలె కూడా బాధ్యతలు స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande