కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడుతూ.. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు జనానికి
CM revanth


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ చీఫ్

కేసీఆర్ (KCR)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడుతూ.. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు జనానికి తెలిసేవి కావని అన్నారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ ఉండటం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ తన అనుమానం ప్రకారం ఆయనను గృహ నిర్బంధం చేశారని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

ఇక రాష్ట్రంలో డీలిమిటేషన్ (Delimitation)పై బీజేపీ నేత లక్ష్మణ్ (Laxman) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్ అయ్యారు. అవి అవగాహన లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణను చాలా తెలివిగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని సీట్లు పెరిగితే అన్ని మహిళా రిజర్వేషన్లు వస్తాయని, ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే 410 సీట్ల గ్యాప్ వస్తుందని తెలిపారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా కూడా భౌగోళికంగా గ్యాప్ అలాగే ఉంటుందని అన్నారు. సీట్ల పెంపులో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి కేవలం ఐదు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు సరిపోతాయని, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లతో పని ఉండదని, ఇప్పటికే తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పుడు ఎంతోకొంత దక్షిణాదిని గుర్తిస్తున్నారని, సీట్ల పెంపులో వ్యత్యాసం వస్తే బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy)లకు రాజకీయంగా అవకాశాలు ఉండవని, దేశంలో నియంత పోకడలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande