ఇక కల్తీ మాఫియా ఖేల్ ఖతం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు, కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ (Eagle), హైడ్రా (HYDRAA) తరహాలో ఒక అత్యాధునిక మరియు అత్యంత కఠినమైన వ్యవస్థను తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్
CM


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు, కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ (Eagle), హైడ్రా (HYDRAA) తరహాలో ఒక అత్యాధునిక మరియు అత్యంత కఠినమైన వ్యవస్థను తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో జరిపిన చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆహార భద్రతా చట్టాలను మరియు వ్యవస్థలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని సీఎం తెలిపారు. అధ్యయనం అనంతరం, పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ మాఫియాకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈగల్, హైడ్రా తరహాలోనే ఈ కొత్త వ్యవస్థకు కూడా విస్తృత అధికారాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించనున్నట్లు సమాచారం.

రైతుల సమస్యలపైనా సీఎం స్పందించారు. పంటలకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈ దళారీ వ్యవస్థకు చరమగీతం పాడి, రైతులకు సరైన న్యాయం చేసేందుకే తాము కనీస మద్దతు ధర (MSP) చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఈ చట్టం రైతు హక్కులను కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande