పాలమూరు పునర్విభజన.. కొత్త నియోజకవర్గాల జోరు!
మహబూబ్నగర్, 30 మార్చి (హి.స.) నియోజకవర్గాల పునర్విభజన కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. కొత్తగా 7 నుండి 8 అసెంబ
Delimitation


మహబూబ్నగర్, 30 మార్చి (హి.స.)

నియోజకవర్గాల పునర్విభజన కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. కొత్తగా 7 నుండి 8 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటుకు అవకాశం ఉండడంతో.. మొత్తం స్థానాలు 20కి పైగా కానున్నది. మరియు రెండు పార్లమెంట్ స్థానాలు ప్రస్తుతం ఉండగా, మరో పార్లమెంట్ స్థానం పెరిగే అవకాశం తో ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాలు మూడుకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ నిపుణుల అంచనా ప్రకారం..

ప్రస్తుతము ఈ జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు ఉండగా... కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణం మధ్యలో నుంచి వెళ్లే రైచూర్ రోడ్డు తూర్పు భాగంకు భూత్పూరు, మూసాపేట మండలాలను కలిపి తూర్పు భాగం, రాయచూరు రోడ్డు నుండి మహబూబ్ నగర్ పట్టణానికి పడమర ఉన్న పట్టణ పట్టణ ప్రాంతానికి హన్వాడ, కోయిలకొండ మండలాలతో ఒక నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్, నవాబుపేటలతో మరో నియోజకవర్గం నవాబుపేట లేదా బాలానగర్ కేంద్రంగా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉన్న జడ్చర్ల మున్సిపాలిటీ, జడ్చర్ల, మిడ్జిల్ మండలాలకు ( అవసరమైతే ) తిమ్మాజిపేట మండలాన్ని చేర్చే అవకాశం ఉంది. దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, అడ్డాకుల మండలాలతో దేవరకద్ర నియోజకవర్గ కొనసాగనుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande