ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తనకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
జనగామ, 30 మార్చి (హి.స.) స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత కార్యకలాపాలను, వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు వరంగల్-హైదరాబాద్
Janagama Congress


జనగామ, 30 మార్చి (హి.స.)

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత కార్యకలాపాలను, వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పై మండల కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారిజోడు రాంబాబు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ రెడ్డి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. నిజాయితీకి నిదర్శనమైన కడియం శ్రీహరి లాంటి నేత పట్ల అనుచితంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వికృత శ్రేష్టలతో పార్టీకి నష్టం చేస్తున్న కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande