కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.
CM TG


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు.

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అంటున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు. 50 శాతం సీట్లు పెంచుతున్నామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని.. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుందని విమర్శించారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande