
ఖమ్మం, 30 మార్చి (హి.స.) ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే
పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన పి. నాగుల్ మీరా తమ గ్రామంలో వారం రోజులుగా పిచ్చి కుక్కలు తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, కామేపల్లి మండలం శివారు లాల్లతండా నివాసులు, గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతూ, అమ్మకాలు చేస్తున్నారని, ఖమ్మం కార్పొరేషన్ శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13 కు చెందిన ప్రజలు తమకు సీసీ రోడ్డుతో పాటు సైడ్ డ్రైనేజీ, మిషన్ భగీరథ పైప్ లైన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతులు చేశారు. స్పందించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయా శాఖల అధికారులకు సత్కారమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ ड. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు